ప్రశ్నించే గొంతుకగా.. ప్రజల పక్షాన జంగా
ప్రశ్నించే గొంతుకగా.. ప్రజల పక్షాన జంగా
విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా.. నిర్బంధాలే నన్ను రాజకీయంగా తీర్చిదిద్దాయి
డీసీసీబీ, ఆయిల్‌ఫెడ్‌లో రైతుల కోసం పనిచేశా.. గ్రేటర్ వరంగల్ మేయర్ రేసులో ఉన్నా
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బరిలో ఉంటా: కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి
హన్మకొండ, సెప్టెంబర్ 04 (నిత్యం నిఘా ప్రతినిధి): విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ, అనేక నిర్బంధాలు, కేసులు ఎదుర్కొంటూ రాజకీయంగా ఎదిగానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ తాజా మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన రాజకీయ ప్రస్థానం, ప్రజా ఉద్యమాలు, రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు, గ్రేటర్ వరంగల్ రాజకీయాలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన లక్ష్యాలపై ఆయన మాట్లాడారు.
• నిర్బంధాల నుంచే రాజకీయ ప్రస్థానం
తమ కుటుంబం మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉందని జంగా రాఘవరెడ్డి తెలిపారు. తన తండ్రి సర్పంచ్‌గా పనిచేశారని, తాను మాత్రం పాఠశాల దశ నుంచే విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న క్రమంలో అప్పటి ప్రభుత్వాల నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నానని, పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదన్నారు. విద్యార్థి దశలో సుధాకర్‌గాంధీ తన రాజకీయ గురువుగా పేర్కొన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే ప్రజా ఉద్యమాల్లోకి వచ్చానని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం నేర్చుకున్నానని, ప్రశ్నించకుండా సమస్యలు పరిష్కారం కావని అన్నారు. నిర్బంధాలు, కేసులు, కష్టాలు ఎదురైన ప్రతిసారీ మరింత పట్టుదలతో పనిచేశానని చెప్పారు.
• రైతుల కోసం పనిచేశా
కాంట్రాక్టర్, వ్యాపారవేత్తగా కొనసాగుతూనే రాజకీయాల్లో చురుగ్గా పనిచేశానని జంగా తెలిపారు. కాజీపేట దర్గా పీఏసీఎస్ చైర్మన్‌గా రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశానని చెప్పారు. ఆ సమయంలో రైతులకు మేలు చేసే పలు కార్యక్రమాలు చేపట్టడంతో పాటు డీసీసీబీని బలోపేతం చేసేందుకు కృషి చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ సీడ్స్ అండ్ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు కృషి చేశానని, రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చేలా ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పించామని చెప్పారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
• పలు నియోజకవర్గాల్లో ప్రత్యేక బలం
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో తనకు ప్రత్యేకంగా పనిచేసే కార్యకర్తల బలం, ప్రజలతో అనుబంధం ఉందని జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి తన వంతు పాత్ర ఉంటుందని తెలిపారు.
‘జంగా అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు.. అనేక నియోజకవర్గాల్లో ప్రజలతో ఉన్న అనుబంధం, కార్యకర్తల బలం కలిసిన రాజకీయ శక్తి’ అని ఆయన పేర్కొన్నారు.
• మేయర్ రేసులో ఉన్నా
రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తాను మేయర్ రేసులో ఉన్నానని జంగా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. తన కుమార్తె డాక్టర్ నిఖితారెడ్డి కూడా ఎన్నికల బరిలో ఉంటారని తెలిపారు. దశాబ్దాలుగా గ్రేటర్ వరంగల్ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని చెప్పారు. మహిళలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్నానన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, పదవి ఉన్నప్పుడే ప్రజల వద్దకు వెళ్లే నాయకుడిని కాదని పేర్కొన్నారు.
• వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం
దేశవ్యాప్తంగా జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం తెలంగాణపై కూడా ఉండే అవకాశం ఉందని జంగా రాఘవరెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల స్వరూపం మారే అవకాశాలను పరిశీలిస్తున్నానని తెలిపారు. డీలిమిటేషన్ తర్వాత తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది నిర్ణయించుకుంటానని, అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అనేక ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పనిచేశానని, ఎక్కడా ధిక్కరించలేదని తెలిపారు. పార్టీ కోసం రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయినా కాంగ్రెస్‌ను వీడలేదని, వచ్చే ఎన్నికల్లో పార్టీ తనకు మంచి అవకాశం ఇస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
• జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉండాలి
రాజకీయాలతో పాటు పాత్రికేయ రంగంలోనూ కొన్ని మార్పులు చోటుచేసుకోవడం బాధ కలిగిస్తోందని జంగా రాఘవరెడ్డి అన్నారు. గతంలో రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యం ఉండేదని, ప్రస్తుతం పవర్ పాలిటిక్స్, మనీ పాలిటిక్స్ పెరిగాయని అభిప్రాయపడ్డారు.
పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని, జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ప్రశ్నించాలని అన్నారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు.