🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

అనారోగ్యంతో బాధపడుతున్న కనుకుంట్ల కొమ్మాలుకు పరామర్శ

Main Image
హనుమకొండ, సెప్టెంబర్ 6 (నిత్యం నిఘా ప్రతినిధి):
నీటిపారుదల శాఖ విశ్రాంత ఉద్యోగి కనుకుంట్ల కొమ్మాలును బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వేముల సత్యమూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పరామర్శించారు. హనుమకొండ హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆయన స్వగృహానికి వెళ్లిన వారు, కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొమ్మాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పండ్లు, పలాలు అందజేసి, సమయానుకూలంగా ఔషధాలు తీసుకుంటూ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు బాల్నే శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్టులు గడ్డం కేశవమూర్తి, వేముల సదానందం, వేముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home