🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

మాంసం వండలేదని భార్యను కడతేర్చిన భర్త

Main Image
శ్రావణ శుక్రవారం కావడంతో వండేందుకు నిరాకరించడంతో దారుణం

నల్గొండ జిల్లా, సెప్టెంబర్‌ 6 (నిత్యం నిఘా ప్రతినిధి):
నల్గొండ జిల్లా కనగల్‌ మండలం శాబ్దుల్లాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాంసం వండలేదనే కోపంతో ఓ భర్త తన భార్యను పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గ్రామానికి చెందిన లింగయ్య తన భార్య లింగమ్మ (65)ను మాంసం తీసుకొచ్చి వండాలని కోరినట్లు సమాచారం. అయితే శ్రావణ శుక్రవారం కావడంతో మాంసం వండేందుకు లింగమ్మ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న లింగయ్య.. రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో పదునైన ఆయుధంతో తలపై దాడి చేసినట్లు సమాచారం.

తీవ్ర గాయాలపాలైన లింగమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
🏠 Home