ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నా
పోచమ్మకుంట అభివృద్ధికి రూ.40 లక్షలతో పనులు.. ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ, సెప్టెంబర్06
ఎన్నికల ముందు పాదయాత్రలు, ప్రజలతో సమావేశాల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్ పోచమ్మకుంటలో రూ.40 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పోచమ్మ బోనాల సందర్భంగా పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచమ్మకుంట తనకు ప్రత్యేకమైన ప్రాంతమని, తన ఇల్లు కూడా ఇదే డివిజన్లో ఉండటంతో ఈ ప్రాంత అభివృద్ధిపై మరింత శ్రద్ధ చూపుతున్నానని చెప్పారు. ప్రజలు తమకు అవసరమైన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు అందిస్తే ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
పోచమ్మకుంటలో కమ్యూనిటీ భవన్ నిర్మాణం, పోచమ్మ దేవాలయ అభివృద్ధి, అంతర్గత రోడ్ల నిర్మాణం తదితర పనులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. రోడ్ల పరిస్థితిని త్వరలోనే పరిశీలించి, అవసరమైన ప్రాంతాలను గుర్తించి పనులు చేపడతామని చెప్పారు.
అదేవిధంగా పోచమ్మకుంట శ్మశానవాటికను ఆధునికంగా, సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వెల్లడించారు. గార్డెన్ తరహాలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు అవసరమైన గదులు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనుల విషయంలో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నాయిని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
కులం, పార్టీకి అతీతంగా ప్రజలకు ఎవరు అభివృద్ధి చేస్తారో వారిని ఆదరించాలని ఎమ్మెల్యే కోరారు. గత పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఇళ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త గృహ నిర్మాణ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పోచమ్మకుంటను ప్రత్యేకంగా దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పునరుద్ఘాటించారు.