🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

Main Image
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

– హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ, సెప్టెంబర్ 6:

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు.

సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే హనుమకొండ, పరకాల ఆర్డీవో కార్యాలయాలతో పాటు జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
🏠 Home