🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు.. మరియు అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నం

Main Image
హైదరాబాద్, సెప్టెంబర్ ‌07 (నిత్యం నిఘా):

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరును పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

మరోవైపు….. బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
🏠 Home