🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

కోడిశెల ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ

Main Image Additional Image
తాడ్వాయి, సెప్టెంబర్‌ 7 (నిత్యం నిఘా ప్రతినిధి):

తాడ్వాయి మండల పరిధిలోని లింగాల గ్రామపంచాయతీ కోడిశెల గ్రామంలోని ఆశ్రమ హైస్కూల్‌లో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఏటూరు నాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో పాఠశాలకు 4 బాత్‌రూమ్‌లు, 4 లెట్రిన్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో స్థానిక హెడ్మాస్టర్ తోలం దేవదాసు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.

ముఖ్య అతిథిగా హాజరైన లింగాల సర్పంచ్ మొగిలిపల్లి రవీందర్ కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులు బహిర్భూమికి వెళ్లకుండా పాఠశాలలో నిర్మిస్తున్న మరుగుదొడ్లను వినియోగించుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ రవీందర్ తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. రేపటి తరాలకు విద్యార్థులే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

మారుమూల ప్రాంతంలో ఉన్న కోడిశెల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ తోలం దేవదాసు, వార్డెన్ కృష్ణ, గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home