మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా
మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా
తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం హనుమకొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సంటి సునీత నియామకం
హనుమకొండ, సెప్టెంబర్ 08:
తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం హనుమకొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సంటి సునీత నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ చైర్పర్సన్ డా. వ్యాసభట్ శ్రీవాణి ప్రకటన విడుదల చేశారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంస్థ చైర్పర్సన్ డా. వ్యాసభట్ శ్రీవాణికి, నియామకానికి కృషి చేసిన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. సత్యనారాయణ దేవరకొండ (సతీష్)కు సంటి సునీత కృతజ్ఞతలు తెలిపారు.
మానవ హక్కుల పరిరక్షణ కోసం తన శక్తిమేరకు పనిచేస్తానని, బాధితులకు అండగా నిలిచి వారికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేస్తామని, హక్కుల ఉల్లంఘన జరిగిన ప్రతిసారీ తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం తరఫున స్పందిస్తామని తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యత సామాజిక బాధ్యతను మరింత పెంచిందని సంటి సునీత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు, స్థానిక ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు నూతనంగా నియమితులైన సంటి సునీతకు శుభాకాంక్షలు తెలిపారు.