వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఘన సన్మానం
నిత్యం నిఘా,బ్యూరో:… (నర్సంపేట)
వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఘన సన్మానం
— ఉన్నత పదవులు, ఉత్తమ సేవలకు గుర్తింపు.. సభ్యుల విజయాలే అసోసియేషన్కు గర్వకారణమని అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్
వరంగల్ రోడ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత పదవులకు ఎన్నికైన, ఉత్తమ సేవలకు గుర్తింపు పొందిన అసోసియేషన్ సభ్యులను ఘనంగా సన్మానించారు.
అసోసియేషన్ అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
ఖానాపురం మండలం పీఆర్టీయూ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన అల్వాల భిక్షపతి, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పెండం భాస్కర్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోతే ఇంద్రసేనారెడ్డి, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన జరుపుల భద్రు, మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన భూక్య రాజలింగం, పద్మశాలి సంఘం సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన పెండం రాజులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ కేవలం ఆరోగ్య పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా, సభ్యుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఆత్మీయ కుటుంబంగా ముందుకు సాగుతోందన్నారు. సభ్యులు వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలు మొత్తం అసోసియేషన్కు గర్వకారణమని పేర్కొన్నారు.
ఒకరి విజయాన్ని మరొకరు ప్రోత్సహించుకోవడం ద్వారా సమాజంలో సానుకూల వాతావరణాన్ని నిర్మించవచ్చన్నారు. సభ్యుల విజయాలు వ్యక్తిగత విజయాలు మాత్రమే కాకుండా మొత్తం వాకర్స్ అసోసియేషన్ కుటుంబానికి గర్వకారణమని, ప్రతిభను గుర్తించడం, సేవలను గౌరవించడం, విజయాలను అభినందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
కార్యక్రమంలో గాజుల సాంబయ్య, మోర్తాల రామ్రాజు, దూపటి కృష్ణమూర్తి, అబ్బరవొయిన వెంకన్న, కుతూరు వీరారెడ్డి, జూలపల్లి రాజేశ్వరరావు, గద్దే శ్రీనివాసరావు, బండి సుధాకర్, వంకాయలపాటి భద్రి, వడిచర్ల సురేష్, కొలువుల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
సభ్యుల మధ్య ఆత్మీయత, ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఇలాంటి అభినందన కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.