🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

ఖాకీ చాటున ‘సెటిల్మెంట్ల’ దందా?

Main Image
నిత్యం నిఘా,బ్యూరో:…


తోటి సిబ్బందిపైనే దురుసు ప్రవర్తన.. భూ వివాదాల్లో జోక్యం?

బాధితుల నుంచి అందినకాడికి వసూళ్ల ఆరోపణలు!


వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఉన్న ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ జమీందార్ వ్యవహారశైలి ప్రస్తుతం పోలీస్ శాఖలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూ, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదాలతో పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులను లక్ష్యంగా చేసుకుని, వారికి న్యాయం చేయాల్సిన స్థానంలో మధ్యవర్తిత్వం పేరుతో వ్యవహారాలు నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘ఖాకీ’ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సెటిల్మెంట్లకు తెరలేపుతున్నారా?
బాధితుల కన్నీళ్లే కొందరికి కాసుల పంటగా మారుతున్నాయా? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

అంతేకాదు.. విధుల్లో ఉన్న సిబ్బందిపట్ల కూడా అధికారి ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ఈ జమీందారీ కి సంబంధించిన మరిన్ని సంచలన ఆరోపణలు, కీలక వివరాలు ‘నిత్యం నిఘా’ దృష్టికి వచ్చినట్లు సమాచారం.

ఆ జమీందార్ ఎవరు..?
ఎవరెవరి భూ వివాదాల్లో జోక్యం చేసుకున్నారు..?
బాధితుల నుంచి ఎంతమేరకు వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి..?
తోటి సిబ్బంది ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు..?

ఈ ప్రశ్నలకు సమాధానాలతో త్వరలో ‘నిత్యం నిఘా’ తెలుగు దినపత్రికలో సంచలన కథనం...
🏠 Home