🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

బొల్లారం ఆయుధాల దోపిడీ కేసులో కీలక మలుపు

Main Image
నిత్యం నిఘా,హైదరాబాద్:..


మాజీ మిలిటరీ అధికారి సహా నలుగురు అదుపులో.. చోరీకి గురైన ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనం

బొల్లారం ఆయుధాల దోపిడీ కేసులో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కీలక పురోగతి సాధించారు. రెండు వారాలుగా మిస్టరీగా ఉన్న ఈ కేసును ఛేదించిన పోలీసులు.. మాజీ మిలిటరీ అధికారితో పాటు మరో ముగ్గురు మిలిటరీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

దాదాపు రెండు నెలల క్రితమే మిలిటరీ ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన ఓ మాజీ అధికారి ఆయుధాల దోపిడీకి పాల్పడినట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయనకు మరో ముగ్గురు మిలిటరీ అధికారులు సహకరించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

చెడు వ్యసనాలకు బానిసైన నేపథ్యంలోనే ఆయుధాలను దోపిడీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు ఛేదన కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో భారీ ఆపరేషన్‌ నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

వారి నుంచి చోరీకి గురైన ఆయుధాలతో పాటు బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించి నిందితులను విచారిస్తూ ఆయుధాల దోపిడీ వెనుక ఉన్న పూర్తి వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.

రెండు వారాలుగా పోలీసులకు సవాల్‌గా మారిన బొల్లారం ఆయుధాల దోపిడీ కేసు.. మాజీ మిలిటరీ అధికారి సహా నలుగురి అరెస్టుతో కీలక మలుపు తిరిగింది. దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
🏠 Home