కాంగ్రెస్కు భారీ షాక్.. బీఆర్ఎస్లోకి 100 మంది
నిత్యం నిఘా,బ్యూరో:భూపాలపల్లి/మొగుళ్లపల్లి:…
— ఇప్పలపల్లిలో ఉపసర్పంచ్ కూతురు వినోద్ ఆధ్వర్యంలో భారీ చేరికలు
— గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో కండువాలు కప్పుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పలపల్లి గ్రామ ఉపసర్పంచ్ కూతురు వినోద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ శుక్రవారం జరిగిన ఈ చేరికలు స్థానికంగా రాజకీయ చర్చకు దారితీశాయి.
ఇప్పలపల్లి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమానికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ మాజీ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్తో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వారికి గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
— ప్రజా వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్పై విమర్శలు
ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, రానున్న రోజుల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
— ప్రజలకు మేలు చేయలేకపోతున్నాం
బీఆర్ఎస్లో చేరిన వినోద్ మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినా, అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఆశించిన స్థాయిలో సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు సాగిందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇప్పలపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉందన్నారు.
— ప్రజాప్రతినిధుల్లో అసమ్మతి?
ఇప్పలపల్లిలో చోటుచేసుకున్న ఈ భారీ చేరికలు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్లో అంతర్గత అసమ్మతిపై చర్చకు తెరలేపాయి. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం, ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి పలువురిలో ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఇప్పలపల్లి పరిణామం ఈ అసంతృప్తికి బహిరంగ రూపం ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో మరికొందరు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ వైపు అడుగులు వేసే అవకాశం ఉందన్న సమాచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ వలసలు ఎంతవరకు కొనసాగుతాయనేది రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.