🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్

Main Image
నిత్యం నిఘా,బ్యూరో(హన్మకొండ/ఎల్కతుర్తి):…


— స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై తాతా మధు వ్యాఖ్యలకు నిరసన

— శాసనమండలి నుంచి బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌


తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు పేర్కొంటున్న అనుచిత, అవమానకర వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్‌, ఎల్‌ఎస్‌సీఎస్‌ సొసైటీ చైర్మన్‌ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముప్పు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తాతా మధును శాసనమండలి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత నాయకుడైన గడ్డం ప్రసాద్‌కుమార్‌ అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న సమయంలో ఆయనపై అవమానకర వ్యాఖ్యలు చేయడం దళితుల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని అన్నారు.

సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల విషయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకే వైఖరితో వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్‌ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home