# ఎల్కతుర్తి సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్
నిత్యం నిఘా,బ్యూరో (హన్మకొండ/ఎల్కతుర్తి):…
— నామినేటెడ్ పాలన వద్దు.. రైతుల చేత ఎన్నుకోబడిన పాలన కావాలి
— బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ డిమాండ్
ఎల్కతుర్తి విశాల సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అన్నారు. వెంటనే సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించి రైతులు తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
సహకార సంఘం పూర్తిగా రైతుల ప్రయోజనాలకు సంబంధించిన సంస్థ అని పేర్కొన్న ఆయన.. రైతులకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించకుండా అధికార పార్టీకి చెందిన నాయకులను నియమించడం వెనుక ఉద్దేశం ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సొసైటీలో సుమారు రూ.3.20 కోట్ల నిధులు ఉన్నట్లు చెబుతున్న నేపథ్యంలో నిధులు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు. గతంలో సొసైటీకి సంబంధించి వచ్చిన అవకతవకల ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిగిందా? ప్రస్తుతం సొసైటీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? అనే వివరాలను రైతులకు బహిర్గతం చేయాలని శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఎన్నికలను ఎదుర్కొని రైతుల తీర్పు పొందే ధైర్యం కాంగ్రెస్ నాయకులకు లేదా అని ఆయన ప్రశ్నించారు. సహకార సంఘాలు రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదని అన్నారు.
ఎల్కతుర్తి సహకార సంఘం రైతులదేనని, ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన వారి సొంత ఆస్తి కాదని స్పష్టం చేశారు. వెంటనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి రైతులు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కును కల్పించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు.
“నామినేటెడ్ పాలన వద్దు.. రైతుల చేత ఎన్నుకోబడిన పాలన కావాలి” అని మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ పేర్కొన్నారు.