🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

కార్యకర్తలతో కొండా సురేఖ కీలక భేటీ

Main Image Additional Image Additional Image Additional Image
నిత్యం నిఘా , బ్యూరో: ….( వరంగల్ తూర్పు నియోజకవర్గం)

— ఢిల్లీ పర్యటనకు ముందు ముఖ్య అనుచరులతో సమావేశం..

— డివిజన్‌ల వారీగా కార్యకర్తల సలహాలు, సూచనలు స్వీకరణ

వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, ముఖ్య అనుచరులతో తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. వరంగల్ నగరంలోని నాయుడు కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని వివిధ డివిజన్‌లకు చెందిన ముఖ్య కార్యకర్తలు, అనుచరులు హాజరయ్యారు.

ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే కొండా సురేఖ ఢిల్లీకి బయలుదేరే ముందు నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. డివిజన్‌ల వారీగా కార్యకర్తలతో మాట్లాడి స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం వాటిని పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగుతామని ఎమ్మెల్యే సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి, కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల్లో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు సమావేశం వేదికగా మారింది. ఢిల్లీ పర్యటన అనంతరం పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు, కార్యాచరణ వెలువడుతాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
🏠 Home