దంచికొట్టిన వాన.. రైతన్నకు గుండె కోత!
నిత్యం నిఘా ,రఘునాథపల్లి మండలం:..
— పంటను మింగేసిన వాన.. పరిహారం కోసం రైతన్న ఎదురుచూపు!
—- రఘునాథపల్లి మండలంలో వరి పొలాలు కొట్టుకుపోయిన వైనం
— మంగళిబండ తండాలో రైతులకు తీవ్ర నష్టం.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
జనగాం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రైతన్నకు గుండె కోత మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పంట పొలాలు నీటమునిగి, చేతికొచ్చిన పంటలు దెబ్బతింటుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రఘునాథపల్లి మండలం మంగళిబండ తండా గ్రామంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వరి పొలాల్లోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరింది. నీటి ఉధృతికి పలువురు రైతులకు చెందిన వరి పొలాలు పూర్తిగా కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే నీటిపాలవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
పంట నష్టంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గ్రామ రైతులు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, అర్హులైన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.