మహేష్ కుమార్ గౌడ్కు ఎర్రబెల్లి స్వర్ణ శుభాకాంక్షలు
నిత్యం నిఘా,బ్యూరో (హైదరాబాద్):
— టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసిన సందర్భంగా సన్మానం
— కాంగ్రెస్ బలోపేతానికి ఆయన నాయకత్వం స్ఫూర్తిదాయకం: ఎర్రబెల్లి స్వర్ణ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రెండేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం గాంధీభవన్లో మహేష్ కుమార్ గౌడ్ను కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందని అన్నారు. పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి స్థాయికి మహేష్ కుమార్ గౌడ్ ఎదిగిన తీరు ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్ తరఫున ఆయనకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు.
రాబోయే రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని, ఆయన మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.