స్వయంభు గణపతికే నిత్య పూజలు కరువా..?
నిత్యం నిఘా,వర్ధన్నపేట:..
స్వయంభు గణపతికే నిత్య పూజలు కరువా..?
— ఆది పూజ్యుడి ఆలయంలో పూజల నిర్వహణపై నిర్లక్ష్యం ఆరోపణలు
— భక్తుల ఆవేదన.. దేవాదాయ శాఖ తీరుపై తీవ్ర అసంతృప్తి ,
విఘ్నాలను తొలగించే ఆది పూజ్యుడు గణనాథుడికే నిత్య పూజలు కరువయ్యాయా..? వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ స్వయంభు గణపతి దేవాలయంలో నిత్య పూజలు, అభిషేకాల నిర్వహణపై నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్వయంభువుగా వెలసిన గణపతిని ప్రతిరోజూ భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటుంటారు. ఇలాంటి విశిష్ట ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలు, అభిషేకాలు క్రమం తప్పకుండా శాస్త్రోక్తంగా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో జరగడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా గణపతి ఆలయ విశిష్టతకు, భక్తుల విశ్వాసానికి భంగం కలుగుతోందని వారు వాపోతున్నారు.
స్వయంభు గణపతికి నిత్య పూజలు సైతం సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
— అధికారుల స్పందన ఏదీ..?
భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయంలో నిత్య పూజలు, అభిషేకాలు క్రమం తప్పకుండా జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు, పూజల నిర్వహణపై వస్తున్న ఆరోపణలను అధికారులు స్వయంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని భక్తులకు వెల్లడించాలని కోరుతున్నారు.
ఆది పూజ్యుడైన గణనాథుడి ఆలయంలో పూజలకే నిర్లక్ష్యం ఎదురైతే.. ఇక ఆలయ నిర్వహణపై పర్యవేక్షణ ఎక్కడ? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.