మామిడి తోటపై రాద్ధాంతం.. ఎమ్మెల్యే నాగరాజు ఓపెన్ ఛాలెంజ్!
నిత్యం నిఘా, వర్ధన్నపేట:..
• “ఒక్క గుంట భూమి ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే.. తోటలో సగభాగం రాసిస్తాం”
• ప్రతిపక్షాల ఆరోపణలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘాటు స్పందన
వర్ధన్నపేటలో ప్రముఖ న్యాయవాది నిమ్మని శేఖర్‌రావుకు చెందిన మామిడి తోట భూమిపై కొనసాగుతున్న వివాదం రాజకీయంగా వేడెక్కుతోంది. కోనారెడ్డి చెరువుకు సంబంధించిన భూమిని ఆక్రమించుకున్నారంటూ ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందించారు. ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు.
నిమ్మని శేఖర్‌రావు కోనారెడ్డి చెరువుకు సంబంధించిన ఒక్క గుంట భూమిని కూడా కలుపుకున్నట్లు నిరూపిస్తే తాను ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు తెలిపారు.
శేఖర్‌రావు సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగిన వ్యక్తి అని పేర్కొన్న ఎమ్మెల్యే.. ఆయనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. భూమికి సంబంధించిన వాస్తవాలను అధికారిక రెవెన్యూ రికార్డులు, భూ సర్వేలు, సంబంధిత పత్రాల ఆధారంగా తేల్చుకోవాలని సూచించారు.
“శేఖర్‌రావు చెరువు భూమిని ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే.. ఆయనకు ఉన్న మామిడి తోటలో సగభాగాన్ని రాసి ఇవ్వడానికి కూడా సిద్ధం. ఇది నా బహిరంగ సవాల్” అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నట్లు సమాచారం.
కేవలం రాజకీయ ఆరోపణలతో ఒక వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, “ఒక్క గుంట భూమి ఆక్రమణ నిరూపిస్తే సగం తోట రాసిస్తాం” అంటూ ఎమ్మెల్యే చేసిన సవాల్ ప్రస్తుతం వర్ధన్నపేట రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సవాల్‌పై ప్రతిపక్షాలు, సంబంధిత భూ వివాద వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.