🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

భద్రాద్రి ఏసీబీ వలలో హాస్టల్ వార్డెన్

Main Image
నిత్యం నిఘా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్ల:..

— కుక్‌ వేతనం విడుదలకు రూ.14 వేల లంచం డిమాండ్

— రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు


వంట మనిషి వేతనం విడుదల చేసేందుకు లంచం డిమాండ్ చేసిన హాస్టల్ వార్డెన్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురంలోని ఎస్టీ బాలుర హాస్టల్‌లో పనిచేస్తున్న కుక్‌ వేతనం విడుదల చేసేందుకు వార్డెన్‌ భూక్యా వాల్‌సింహ రూ.14 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

లంచం డిమాండ్‌పై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీగా వల పన్నారు. లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో వార్డెన్‌ భూక్యా వాల్‌సింహను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.

మారుమూల ప్రాంతాల నుంచి సైతం అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు నేరుగా తమ దృష్టికి వస్తున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ సేవలు అందించేందుకు లంచం డిమాండ్ చేస్తే ఉపేక్షించేది లేదని, అవినీతికి పాల్పడే అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
🏠 Home