చింతలపల్లి ఎస్సీ కాలనీలో ఘనంగా మహా అన్నదానం
నిత్యం నిఘా,ఎల్కతుర్తి:..
గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కార్యక్రమం
పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, గ్రామస్తులు
ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణపతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామస్తులు, కాలనీవాసులు, ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
గణపతి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు, ఎస్సీ కాలనీవాసులు ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. భక్తి, సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన భక్తులు, గ్రామస్తులు, దాతలు, ప్రతి ఒక్కరికీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.