🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

ఈ నెల 23న గణేష్ ఉత్సవ నిర్వాహకుల సమన్వయ సమావేశం

Main Image
నిత్యం నిఘా,జనగాం:..

—- మండపాల నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి

— అధికారులతో జేగీయూఎస్ ప్రతినిధుల భేటీ.. ఉత్సవ ఏర్పాట్లపై చర్చ

చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 23న జనగామ పట్టణంలోని సాయిరాం (కామాక్షి) ఫంక్షన్ హాల్‌లో గణేష్ ఉత్సవ నిర్వాహకుల సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు జనగామ గణేష్ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

స్థానిక జేగీయూఎస్ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్క కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంచాల రవీందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ నిబంధనలు, ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై ఈ సమన్వయ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు.

— అధికారులతో ఉత్సవ ఏర్పాట్లపై చర్చ

సమన్వయ సమావేశం అనంతరం జేగీయూఎస్ ప్రతినిధుల బృందం జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, నిమజ్జన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధికారులతో చర్చించి వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జేగీయూఎస్ జిల్లా కోశాధికారి రంగ నరసింహారావు, ఉపాధ్యక్షులు వారణాసి పవన్ శర్మ, కార్యదర్శులు సాదాం మదన్ మోహన్ యాదవ్, బింగి రమేష్, సంపత్, గండి నాగరాజు, మంగ శ్రీకాంత్, కోలిపాక లక్ష్మణ్, కంచర్ల పవన్, చింతపండు వెంకటేష్, భూక్యా మనోహర్, చందు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home