🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ‘కమిషన్’ దందా?

Main Image
రోగులను తీసుకొచ్చే మధ్యవర్తులకు ముందే రేట్లు..?

ఆపరేషన్, ప్రసవం, చికిత్సలకూ ‘ఫిక్స్‌డ్’ కమిషన్ల ఆరోపణలు.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు

హనుమకొండ, సెప్టెంబర్ 22 (నిత్యం నిఘా):
హనుమకొండ నగరంలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులను మధ్యవర్తుల ద్వారా తీసుకురావడం, అందుకు ప్రతిఫలంగా కమిషన్లు చెల్లిస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొందరు మధ్యవర్తులు రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లే వ్యవహారం సాగుతోందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* చికిత్సకు ఓ రేటు.. ఆపరేషన్‌కు మరో రేటు?

మధ్యవర్తుల ద్వారా ఆసుపత్రులకు వచ్చే రోగులకు సంబంధించి వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలు, ప్రసవాలకు ముందుగానే నిర్దిష్ట మొత్తాల్లో కమిషన్లు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ రోగిని ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలి? ఎలాంటి చికిత్సకు ఎంత మొత్తం వస్తుంది? అనే విషయాల్లో కొందరు మధ్యవర్తులు వ్యవహరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఆసుపత్రుల యాజమాన్యాల పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత ఆసుపత్రుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

* రోగి అవసరమా.. కమిషనే ముఖ్యమా?

వైద్యం కోసం ఆసుపత్రిని ఆశ్రయించే రోగి ఆరోగ్య పరిస్థితి, అవసరమైన చికిత్స ఆధారంగా వైద్య నిర్ణయాలు ఉండాల్సినప్పటికీ, కమిషన్ల కోసం రోగులను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోగి నుంచి వసూలు చేసే చికిత్స ఖర్చులో మధ్యవర్తుల కమిషన్ కూడా ఏదైనా భాగమవుతోందా? ఆసుపత్రుల్లో రోగులను చేర్పించే వ్యక్తులకు ఎంత మొత్తంలో చెల్లింపులు జరుగుతున్నాయి? ఈ వ్యవహారంపై ఆసుపత్రి యాజమాన్యాలకు అవగాహన ఉందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

* అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?

ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల చేర్పు విధానం, చికిత్సల ధరలు, శస్త్రచికిత్సల పేరుతో వసూలు చేస్తున్న మొత్తాలు, మధ్యవర్తుల ప్రమేయంపై సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. మధ్యవర్తుల ద్వారా రోగులను తీసుకురావడం, అందుకు కమిషన్లు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వాస్తవమైతే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రశ్నగా మారింది. ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
🏠 Home