పసర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
నిత్యం నిఘా (ములుగు జిల్లా,తాడ్వాయి):..
సూపర్ లగ్జరీ బస్సు–బొలెరో ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ములుగు జిల్లా తాడ్వాయి మండలం పసర సమీపంలోని కొండపర్తి వద్ద 163వ జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు రాంగ్ రూట్లో వచ్చి బొలెరో వాహనాన్ని ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం.
ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా కొద్దిసేపు జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, గాయపడిన వారి వివరాలు, వారి పరిస్థితిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.