🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం

Main Image
నిత్యం నిఘా (ములుగు జిల్లా/తాడ్వాయి):

• జయంతి సందర్భంగా కాటాపురం లో విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు..

తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, సమాజ సేవకు అంకితమైన ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్నాటి సత్యం, ఉప్పలి శివ, పుష్ప వెంకటేశ్వర్లు, సాంబారు రాజేశం, న్యాతని రామ్మోహన్, రామారావు, బాషాని , ముండ్రాతి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home