🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

వర్ధన్నపేటలో గంజాయి కలకలం...పోలీసుల అదుపులో ఇద్దరు గంజాయి నిందితులు

Main Image
నిత్యం నిఘా,వర్ధన్నపేట:..

చాకచక్యంగా పట్టుకున్న వర్ధన్నపేట పోలీసులు.. ముమ్మరంగా విచారణ.

వర్ధన్నపేట పట్టణంలో గంజాయి వ్యవహారం కలకలం రేపుతోంది. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించి ఇద్దరు అనుమానితులను వర్ధన్నపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు చాకచక్యంగా నిఘా పెట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిని విచారిస్తూ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి సరఫరా చేస్తున్నారు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పోలీసుల అధికారిక ప్రకటన అనంతరం పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
🏠 Home