🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Main Image Additional Image
నిత్యం నిఘా,హన్మకొండ:.

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి


జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెల్లి కిరణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమాజంలో డిజిటల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో మీడియా రంగానికి సంబంధించిన విధానపరమైన సిఫార్సుల కోసం ప్రత్యేకంగా కొత్త మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

శుక్రవారం హన్మకొండలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తీసుకురావాలని, ముద్రణ, ప్రసార, డిజిటల్ మీడియా ఉద్యోగులకు వర్తించేలా కొత్త వేతన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన నాగరాజు మాట్లాడుతూ ముద్రణ, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా అనే తేడాలు లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రధాన జర్నలిస్టు సంఘాలు ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయాయని వారు పేర్కొన్నారు. డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సంఘం గౌరవ సలహాదారు రాజేశ్వరరావు, కోశాధికారి వంశీ, ఉపాధ్యక్షుడు మోహన్‌రావు, సహాయ కార్యదర్శి నగేష్‌గౌడ్, కార్యవర్గ సభ్యులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.
🏠 Home