🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

అక్టోబర్‌ 6న చలో హైదరాబాద్

Main Image
నిత్యం నిఘా,ఎల్కతుర్తి

ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలి

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాలలో అక్టోబర్‌ 6న నిర్వహించనున్న ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

ఎమ్మార్పీఎస్‌ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు అడ్డూరి అనిల్‌ మాదిగ ఆదేశాల మేరకు శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్థులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 6న చేపట్టనున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై చర్చించారు.

ఎంఎస్‌ఎఫ్‌ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గొల్లమందల చరణ్‌ మాదిగ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు, హక్కులు, విద్యారంగానికి సంబంధించిన అంశాలతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై జాతీయ ప్రతినిధుల మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. ఎల్కతుర్తి మండలం నుంచి విద్యార్థులు, ఎంఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు.

అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 2 గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాలలో జరిగే ఈ మహాసభకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలు, హక్కులపై చర్చల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
🏠 Home