తాళ్లరాంపూర్లో సాంఘిక బహిష్కరణపై గౌడ సంఘాల ఆగ్రహం
నిత్యం నిఘా,హైదరాబాద్:.
భూములు లాక్కుంటే అడ్డుకోవడమే నేరమా?
గీత కార్మికులకు రక్షణ కల్పించాలి.. గౌడ సంఘాల జేఏసీ
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులు, దళిత గీత కార్మికులపై దాడులు, సాంఘిక బహిష్కరణకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ, మోకుదెబ్బ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలను అరికట్టాలని కోరాయి.
హైదరాబాద్లోని మోకుదెబ్బ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, మోకుదెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రాగుల సిద్దిరాములు గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజ్ గౌడ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది, మోకుదెబ్బ జాతీయ అధికార ప్రతినిధి బాలసాని సురేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు ఏవీ బాలేషం గౌడ్, అనంతుల రమేష్ గౌడ్, కేసరి ఆంజనేయులు గౌడ్ తదితరులు మాట్లాడారు.
తాళ్లరాంపూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 67లో సుమారు 35 ఏళ్ల క్రితం గౌడ కులస్తులు 4.5 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి కొంత భూమిలో ఈత చెట్లను పెంచుకుంటున్నారని నాయకులు తెలిపారు. పక్కనే ఉన్న సర్వే నంబర్ 66లోని భూములకు సంబంధించిన వివాదం కారణంగా సర్వే నంబర్ 67లోని భూమిపై కూడా హక్కు వివాదం ఏర్పడిందని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు కొలతలు నిర్వహించి గౌడ కులస్తుల భూమికి హద్దులు నిర్ణయించారని, అనంతరం హద్దులను తొలగించి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
గౌడ కులస్తుల ఈత, తాటి చెట్లను గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో పలుమార్లు నరికివేశారని, గ్రామ మైక్ ద్వారా సాంఘిక బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారని నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలపై వార్తా సేకరణకు వెళ్లిన పాత్రికేయులపై కూడా దాడి జరిగిందని, పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, గౌడ మహిళలపై దాడులు జరిగినట్లు వారు పేర్కొన్నారు.
గౌడ కులస్తులు సమావేశమైన సమయంలో గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో గౌడ భవనంపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలను రప్పించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు నిందితులపై తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు.
ఇటీవల గ్రామంలో గౌడ కులస్తులు, దళిత గీత కార్మికులను సామాజికంగా వెలివేస్తూ చాకలి, మంగలి, కిరాణా దుకాణాలు, హోటళ్లకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని నాయకులు ఆరోపించారు. సమస్యపై పోలీసు అధికారులను ఆశ్రయించిన సమయంలో కేసులను ఉపసంహరించుకుని రాజీ పడాలని, లేనిపక్షంలో గతంలో జరిగిన చుండూరు, కారంచేడు తరహా పరిణామాలు పునరావృతమవుతాయని హెచ్చరించినట్లు వారు పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై సంబంధిత పోలీసు అధికారుల వివరణ తమకు అందలేదని తెలిపారు.
తాళ్లరాంపూర్ ఘటనపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు నాయకులు వెల్లడించారు. సమస్యపై పూర్తి సమాచారం సేకరించి న్యాయం చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. స్థానిక పోలీసు అధికారులపై కూడా ఫిర్యాదులు ఉన్నందున సంబంధిత అధికారులను బదిలీ చేసి బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అరికట్టాలని, అలాంటి కమిటీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తాళ్లరాంపూర్ బాధితులకు న్యాయం జరిగే వరకు దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముత్యం నర్సింలు గౌడ్, రాగుల కిరణ్ కుమార్ గౌడ్, రవీందర్ గౌడ్, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.