పల్లె సీను సాహిత్యం భవిష్యత్ తరాలకు అమూల్యమైన సంపద
నిత్యం నిఘా ,బ్యూరో(హన్మకొండ):..
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. రియాజ్
ఘనంగా పల్లె సీను ఐదు పుస్తకాల ఆవిష్కరణోత్సవం
కవి, రచయిత పల్లె సీను రచనలు భవిష్యత్ తరాలకు అమూల్యమైన సాహితీ సంపదగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. రియాజ్ అన్నారు. తన చిన్ననాటి గురువైన పల్లె సీను సాహిత్యం భావితరాలకు గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పల్లె సీను సహస్ర చంద్ర దర్శన వేళ ఆయన రచించిన ఐదు పుస్తకాల ఆవిష్కరణోత్సవం హనుమకొండలోని హరిత కాకతీయలో ఘనంగా జరిగింది. శ్రీలేఖ సాహితి సంస్థ వరంగల్ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమానికి డా. రియాజ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లె సీను వంటి గురువులు నేటి కాలంలో అరుదుగా కనిపిస్తారని అన్నారు. ఆయన రచనలు, సాహితీ ఆలోచనలు రానున్న తరాలకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
మరో అతిథి దహగాం సాంబమూర్తి మాట్లాడుతూ, పల్లె సీను ఆలోచనలు సాహిత్యంలోని లోతైన అంశాలను పరిచయం చేస్తాయని అన్నారు. ముఖ్యంగా వచన కవిత్వంపై ఆయనకు విశేషమైన పట్టు ఉందని కొనియాడారు.
అనంతరం ప్రముఖ రచయిత, శ్రీలేఖ సాహితి ఉపాధ్యక్షుడు పల్లె సీను రచించిన ‘గగన తరంగాలు’, ‘మైత్రీ భావ తరంగాలు’, ‘పల్లె అంతరంగం’, ‘నేను కవిత్వాన్ని’, ‘నా సాహిత్య సంబంధాలు’ అనే ఐదు పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఐతా చంద్రయ్య, డా. మడత భాస్కర్, కందుకూరి శ్రీరాములు, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, డా. పర్చా అంజనీదేవి, టి. ఉడయవర్లు, డా. అమ్మిన శ్రీనివాసరాజు, రచయిత, సీనియర్ పాత్రికేయుడు శంకేశి శంకర్రావు, వరిగొండ కాంతారావు, పల్లె నాగేశ్వర్ రావు, డా. ఎన్.వి.ఎన్. చారి, గుడిపాటి, డా. పల్లేరు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. పలువురు రచయితలు పల్లె సీను రచించిన పుస్తకాల విశిష్టతను సభికులకు పరిచయం చేశారు. సాహితీ మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.