🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

ఇందిరమ్మ ఇంట్లో కాంగ్రెస్ నాయకుల దీపావళి సంబరాలు

Main Image
నిత్యం నిఘా,హన్మకొండ/ఎల్కతుర్తి :

ఇందిరమ్మ ఇంట్లో కాంగ్రెస్ నాయకుల దీపావళి సంబరాలు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నూతన వస్త్రాల అందజేత.. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకలు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగను జరుపుకునే లక్ష్యంతో జగన్నాధపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గుండాల భాగ్యలక్ష్మి–మధు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా వారికి నూతన వస్త్రాలను అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరెపల్లి భాగ్యలక్ష్మి–మల్లయ్య, మాజీ ఉపసర్పంచులు ఆరెపల్లి సమ్మయ్య, ఆరెపల్లి రాములు, వార్డు సభ్యులు ఆరెపల్లి సమ్మయ్య, పెండ్యాల కుమారస్వామి, ఆరెపల్లి చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల శామ్యూల్, పంజాల చేటరి, పంజాల సమ్మయ్య (న్యాయవాది), పంజాల స్వామి, పంజాల శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు పంజాల అజయ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ యువజన నాయకుడు పెండ్యాల రాజేష్, పంజాల వెంకటేష్, గూటం శ్రీనివాస్ రెడ్డి, బొంత అనిల్, ఎస్.డి. ఫాజల్, ఆరెపల్లి రాజు, మాటూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home