ఎస్‌ఐ ప్రాథమిక పరీక్ష.. వాకర్స్‌కు పోలీసుల విజ్ఞప్తి
నిత్యం నిఘా,వరంగల్ ట్రైసిటీ:
ఎస్‌ఐ ప్రాథమిక పరీక్ష.. వాకర్స్‌కు పోలీసుల విజ్ఞప్తి
ఆరు పరీక్షా కేంద్రాల మైదానాల్లో రెండు రోజుల పాటు వాకింగ్‌కు అనుమతి లేదు
పరీక్షల నిర్వహణకు సహకరించాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కోరారు
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆదివారం నిర్వహించనున్న ఎస్‌ఐ ప్రాథమిక రాత పరీక్షల నేపథ్యంలో ట్రై సిటీ పరిధిలోని వాకర్స్‌కు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత విజ్ఞప్తి చేశారు. పరీక్షల భద్రత, నిర్వహణ ఏర్పాట్ల దృష్ట్యా పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన కళాశాలలు, పాఠశాలల మైదానాల్లో తాత్కాలికంగా వాకింగ్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 32 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి, 29వ తేదీ ఆదివారం ఉదయం వరకు కింది పరీక్షా కేంద్రాల మైదానాల్లో వాకింగ్‌కు రావద్దని వాకర్స్‌కు సూచించారు.
కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ హైస్కూల్, హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కాకతీయ డిగ్రీ కళాశాల, కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణం, వరంగల్‌లోని లాల్ బహదూర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానాల్లో వాకింగ్‌కు తాత్కాలికంగా అనుమతి ఉండదని తెలిపారు.
పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న భద్రతా చర్యలకు వాకర్స్‌తో పాటు ప్రజలందరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత విజ్ఞప్తి చేశారు.