‘మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు?’
కన్నీళ్లు పెట్టుకుంటూ కొండా సుష్మిత ఆవేదన.. రేవంత్రెడ్డిపై తీవ్ర ఆరోపణలు హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీళ్లు పెట్టుకుంటూ తన తల్లిదండ్రులను ఉద్దేశించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఏ తప్పు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. “అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. మా అమ్మను ఇంత అవమానిస్తారని తెలిస్తే నేను అలా మాట్లాడేదాన్ని కాదు” అంటూ సుష్మిత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక సామాన్య కార్యకర్తగా ప్రారంభించి మంత్రి స్థాయికి ఎదిగిన మహిళపై సీఎం రేవంత్రెడ్డి ఇంత పగ పెంచుకుంటారని తాను ఊహించలేదన్నారు. తాను మాట్లాడిన మాటల్లో...