ఇంట్లో ఉరి వేసుకుని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
కేసముద్రం, సెప్టెంబర్ 6 (నిత్యం నిఘా ప్రతినిధి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచా తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోడ వైష్ణవి (15) అనే పదో తరగతి విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాత్రి ఇంట్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలిక ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.