ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నేత నేపాల్ రెడ్డికి జంగా రాఘవరెడ్డి పరామర్శ
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 6 (నిత్యం నిఘా ప్రతినిధి): స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఉనికిచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆత్మీయ మిత్రుడు పల్లె నేపాల్ రెడ్డి ఇటీవల బైక్ ప్రమాదానికి గురై చికిత్స అనంతరం స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. నేపాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జంగా రాఘవరెడ్డి.. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్ట సమయంలో నేపాల్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నేపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన జంగా...