మాంసం వండలేదని భార్యను కడతేర్చిన భర్త
శ్రావణ శుక్రవారం కావడంతో వండేందుకు నిరాకరించడంతో దారుణం నల్గొండ జిల్లా, సెప్టెంబర్ 6 (నిత్యం నిఘా ప్రతినిధి): నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాంసం వండలేదనే కోపంతో ఓ భర్త తన భార్యను పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన లింగయ్య తన భార్య లింగమ్మ (65)ను మాంసం తీసుకొచ్చి వండాలని కోరినట్లు సమాచారం. అయితే శ్రావణ శుక్రవారం కావడంతో మాంసం వండేందుకు లింగమ్మ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న లింగయ్య.. రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో పదునైన ఆయుధంతో తలపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర...