ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నా

పోచమ్మకుంట అభివృద్ధికి రూ.40 లక్షలతో పనులు.. ఎమ్మెల్యే నాయిని హనుమకొండ, సెప్టెంబర్‌06 ఎన్నికల ముందు పాదయాత్రలు, ప్రజలతో సమావేశాల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్‌ పోచమ్మకుంటలో రూ.40 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. పోచమ్మ బోనాల సందర్భంగా పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచమ్మకుంట తనకు...