నా చీర లాగారు.. సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 07, 2026 అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ఉద్రిక్తత నెలకొంది. లోపలికి వెళ్తున్న సమయంలో పోలీసులు తన చీర లాగారని BRS ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళల పట్ల ఇలాగేనా వ్యవహరించేది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓదార్చారు. బ్లాక్ టీషర్ట్లు ధరించిన BRS ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో జగదీశ్ రెడ్డి కాలికి గాయమైంది. మరోవైపు, రేవంత్ రెడ్డికి ఇంతకు ఇంతా చెల్లిస్తామని KTR హెచ్చరించారు. అసెంబ్లీ తొలిరోజే రాజకీయ వేడి తారస్థాయికి!