కోడిశెల ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ
తాడ్వాయి, సెప్టెంబర్ 7 (నిత్యం నిఘా ప్రతినిధి): తాడ్వాయి మండల పరిధిలోని లింగాల గ్రామపంచాయతీ కోడిశెల గ్రామంలోని ఆశ్రమ హైస్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఏటూరు నాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో పాఠశాలకు 4 బాత్రూమ్లు, 4 లెట్రిన్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో స్థానిక హెడ్మాస్టర్ తోలం దేవదాసు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన లింగాల సర్పంచ్ మొగిలిపల్లి రవీందర్ కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులు బహిర్భూమికి వెళ్లకుండా పాఠశాలలో నిర్మిస్తున్న మరుగుదొడ్లను వినియోగించుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పాఠశాలలో...