అసెంబ్లీ ముందు ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు

కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మందిపై FIR.. పోలీసులతో ఘర్షణలపై ఆరోపణలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘర్షణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీ ముందు జరిగిన ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి బీఆర్ఎస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్లు కూడా FIRలో ఉన్నట్లు తెలుస్తోంది. విధుల్లో ఉన్న పోలీసులను నెట్టివేయడం, పోలీసుల కాలర్లు పట్టుకోవడం, విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులను దూషించడం, బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. మహిళా పోలీసుల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా...