మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేస్తే పోలీసుల పరిశీలన ఎందుకు?

గౌరవ సభ కాదు.. కౌరవ సభ: హరీశ్‌రావు హైదరాబాద్‌, సెప్టెంబర్‌08: మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగినా పోలీసులు చర్యలు తీసుకోకుండా, బాధితులపైనే కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీలపై దాడి చేశారని, అయితే పోలీసులు ఉల్టా వారిపైనే కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనను పోలీసులు పరిశీలిస్తారని మంత్రి చెబుతున్నారని, మరి దాడి చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశిస్తూ ఇది గౌరవ సభ కాదని, కౌరవ సభగా మారిందని ఆయన తీవ్ర...