కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లో చేరిన 50 మంది నాయకులు, కార్యకర్తలు
స్టేషన్ఘన్పూర్, సెప్టెంబర్08 స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండలం కంచనపల్లి మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య నాయకత్వంలో వారు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రఘునాథపల్లి మాజీ ఎంపీపీ వై.కుమార్ గౌడ్, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ గవ్వని నాగేశ్వరరావు, రఘునాథపల్లి కంటెస్టెంట్ సర్పంచ్ గూడ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ తాటికొండ రాజయ్య వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి...