సెప్టెంబర్ 12న ములుగు జిల్లా కోర్టులో లోక్ అదాలత్

నిత్యం నిఘా,బ్యూరో:.. కేసుల పరిష్కారానికి రాజీమార్గమే రాజమార్గం: ఎస్సై జగదీష్ గౌడ్ ములుగు జిల్లా కోర్టులో ఈ నెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాడ్వాయి ఎస్సై జగదీష్ గౌడ్ సూచించారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులను లోక్ అదాలత్ ద్వారా సత్వరమే పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. క్షణిక ఆవేశంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేసే అవకాశం ఉంటుందని, అలాంటి కేసుల్లో రాజీ మార్గమే రాజమార్గమని ఎస్సై పేర్కొన్నారు. కేసులు దీర్ఘకాలంగా కొనసాగితే సమయం, డబ్బు వృథా అవుతాయని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల సమ్మతితో కేసులను సులభంగా పరిష్కరించుకునే...