సంగెంలో చల్లా ధర్మారెడ్డి బర్త్‌డే వేడుకలు.. భారీగా పాల్గొన్న బీఆర్‌ఎస్ శ్రేణులు

నిత్యం నిఘా,బ్యూరో:.. — ఘనంగా చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు — సంగెం మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు పరకాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలను సంగెం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. చల్లా ధర్మారెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం మరింత సేవ చేయాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో...