చర్లలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

నిత్యం నిఘా,బ్యూరో:… — ఉత్తమ సేవలందించిన 30 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్ల మండల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యా రంగంలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నారు. హైస్కూల్, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, పీఎస్/యూపీఎస్, సీఆర్‌పీ, ఎంఆర్‌సీ విభాగాల నుంచి ఎంపికైన మొత్తం 30 మంది ఉపాధ్యాయులను సన్మానించేందుకు నిర్వాహకులు జాబితాను విడుదల చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి చర్ల రైతు వేదికలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. సమాజ నిర్మాణంలో గురువులు అందిస్తున్న సేవలను స్మరిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు,...