వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఘన సన్మానం

నిత్యం నిఘా,బ్యూరో:… (నర్సంపేట) వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఘన సన్మానం — ఉన్నత పదవులు, ఉత్తమ సేవలకు గుర్తింపు.. సభ్యుల విజయాలే అసోసియేషన్‌కు గర్వకారణమని అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్ వరంగల్ రోడ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత పదవులకు ఎన్నికైన, ఉత్తమ సేవలకు గుర్తింపు పొందిన అసోసియేషన్ సభ్యులను ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఖానాపురం మండలం పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన అల్వాల భిక్షపతి, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పెండం భాస్కర్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన...