రైతుల పంటలను కాపాడేందుకు దేవాదుల, ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలి
నిత్యం నిఘా ,బ్యూరో:… రైతుల పంటలను కాపాడేందుకు దేవాదుల, ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలి —-రెండు రోజుల్లో దేవాదుల నీళ్లు విడుదల చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ దేవాదుల, ఎస్సారెస్పీ నీళ్లు అందక పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి చిన్నాన్న మురళీధర్ రావు మనుమడి వివాహ విందు కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసిన ఆయన రైతుల సమస్యలను వివరించారు. వారం రోజుల క్రితం రైతులు నీటి కోసం ధర్నా నిర్వహించగా రెండు...