ఖాకీ చాటున ‘సెటిల్మెంట్ల’ దందా?
నిత్యం నిఘా,బ్యూరో:… తోటి సిబ్బందిపైనే దురుసు ప్రవర్తన.. భూ వివాదాల్లో జోక్యం? బాధితుల నుంచి అందినకాడికి వసూళ్ల ఆరోపణలు! వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఉన్న ఓ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ జమీందార్ వ్యవహారశైలి ప్రస్తుతం పోలీస్ శాఖలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూ, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదాలతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించే బాధితులను లక్ష్యంగా చేసుకుని, వారికి న్యాయం చేయాల్సిన స్థానంలో మధ్యవర్తిత్వం పేరుతో వ్యవహారాలు నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఖాకీ’ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సెటిల్మెంట్లకు తెరలేపుతున్నారా? బాధితుల కన్నీళ్లే కొందరికి కాసుల పంటగా...