సెక్రటేరియట్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు
నిత్యం నిఘా,బ్యూరో:…హైదరాబాద్:. సెక్రటేరియట్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు —- సీఎం సహాయ నిధి మంజూరుకు రూ.లక్ష డిమాండ్..రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎసీబి తెలంగాణ సచివాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సీఎం సహాయ నిధికి సంబంధించి రూ.2 లక్షల మంజూరు కోసం రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సచివాలయంలోని గుడి వద్ద లంచం తీసుకుంటుండగా సెక్షన్ ఆఫీసర్ వినోద్‌తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. లంచం డిమాండ్,...