బొల్లారం ఆయుధాల దోపిడీ కేసులో కీలక మలుపు
నిత్యం నిఘా,హైదరాబాద్:.. మాజీ మిలిటరీ అధికారి సహా నలుగురు అదుపులో.. చోరీకి గురైన ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనం బొల్లారం ఆయుధాల దోపిడీ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. రెండు వారాలుగా మిస్టరీగా ఉన్న ఈ కేసును ఛేదించిన పోలీసులు.. మాజీ మిలిటరీ అధికారితో పాటు మరో ముగ్గురు మిలిటరీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాదాపు రెండు నెలల క్రితమే మిలిటరీ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన ఓ మాజీ అధికారి ఆయుధాల దోపిడీకి పాల్పడినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయనకు మరో ముగ్గురు మిలిటరీ అధికారులు సహకరించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. చెడు వ్యసనాలకు బానిసైన నేపథ్యంలోనే ఆయుధాలను...